ఎల్ఆర్ఎస్ సర్వే పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ఎల్ఆర్ఎస్ సర్వే పక్కగా, వేగవంతంగా నిర్వహించాలని
దిశ, కామారెడ్డి : ఎల్ఆర్ఎస్ సర్వే పక్కగా, వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ వార్డ్ నెంబర్ 1 లోని పలు భూముల ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఎల్ఆర్ఎస్ పథకం సర్వే ను మార్గదర్శకాలకు అనుగుణంగా, వేగవంతంగా నిర్వహించాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా భూములను పరిశీలించాలని తెలిపారు. వివరాలను సర్వే యాప్ లో పొందుపర్చాలని తెలిపారు. పకడ్బందీగా, పక్కాగా సర్వే చేపట్టాలన్నారు. ఏ రోజు కారోజూ నివేదికలను అప్ డేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ రావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, తహసీల్దార్ జనార్దన్, మున్సిపల్, రెవెన్యూ, నీటి పారుదల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి..
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత రాశీ వనంలో కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం ఎన్సీసి విద్యార్థులచే గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కళాశాల లోని కంప్యూటర్ ల్యాబ్, ఫారెస్ట్రీ ల్యాబ్ లను పరిశీలించి, విద్యార్థులను సంబంధిత సబ్జెక్టు పై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఉన్న పనికి రాని స్క్రాప్ ని నిబంధనల మేరకు తొలగించాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ గదిలో పలు అంశాలపై చర్చించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, బోధన అంశాలపై ప్రిన్సిపాల్ కే.విజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్ రావు, కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, లెక్చరర్స్ పాల్గొన్నారు.