డస్ట్ తెచ్చిన చిచ్చు

నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్ లో రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు పై రోజుల తరబడి నిర్మాణ సామాగ్రి ఉంచిన విషయం పై ప్రశ్నించిన స్థానికుల పై కార్పొరేటర్ అనుచరులు దౌర్జన్యం చేసి కొట్టారు.

Update: 2023-12-18 10:10 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్ లో రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు పై రోజుల తరబడి నిర్మాణ సామాగ్రి ఉంచిన విషయం పై ప్రశ్నించిన స్థానికుల పై కార్పొరేటర్ అనుచరులు దౌర్జన్యం చేసి కొట్టారు. ఈ సంఘటన సోమవారం ఉదయం నగరంలోని సితారాం నగర్ కాలనీలో జరిగింది. సీతారాం నగర్ కాలనీలో ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే రోజుల తరబడి అక్కడ సామాగ్రి ఉండటంతో స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దానికి తోడు నిర్మాణ సామాగ్రి ద్వార వెలువడుతున్న దుమ్ము, ధూళి స్థానిక జనవాసాల్లోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ప్రార్థన మందిరానికి సంబంధించిన నీటి వినియోగం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది.

ప్రార్థన ఆలయ కమిటీ అనుమతి లేకుండానే దాని వినియోగం పై  కమిటీ బాధ్యులు కిషన్ అతని తనయుడు సోమవారం కార్పొరేటర్ పట్నం విక్రం గౌడ్ ను నిలదీశారు. ఈ విషయంలో అక్కడ వాగ్వివాదం జరిగింది. అక్కడే ఉన్న కార్పొరేటర్ అనుచరులు స్థానికుల పై దాడి చేశారు. అది కాస్త వివాదం కావడంతో అందరూ అక్కడికి చేరుకోవడంతో గొడవ పెద్దదైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని గొడవ సద్ధుమణిగించారు. ఈ విషయం పై స్థానికులు స్థానిక ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ అనుచరుడు సైతం తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News