దిశ ప్రతినిధి, నిజామాబాద్: గోదావరి నదిపై ఉన్న బాబ్లీ ప్రాజేక్టు గేట్లను మంగళవారం అధికారులు ఎత్తివేశారు. మహరాష్ర్ట- తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న అంతరాష్ర్ట నది జలాల ఓప్పందం ప్రకారం సుప్రీంకోర్టు అదేశాల మేరకు మహరాష్ర్టలోని నాందేడ్ జిల్లా సరిహద్దులో ఉన్న బాబ్లీ ప్రాజెక్టుకు చెందిన గేట్లను ఎత్తి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. ప్రతి ఏడాది వేసవిలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని పశువుల తాగునీటి అవసరాల కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలసంఘం అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తారు. అర టీఎంసీ నీటిని విడుదల పూర్తి కాగానే అధికారులు వాటిని మూసివేస్తారు. మంగళవారం కేంద్ర జలవనరుల సంఘం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు, మహరాష్ర్టలోని నాందేడ్ డివిజన్ డిప్యూటీ ఈఈ ఎ. ఎస్ ఛౌగలే, శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ సుకుమార్ లు ఉన్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 90 టీఎంసీలకు గాను 55.522 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి నిత్యం 7804 క్యూసెక్కుల నీటిని వదిశ ప్రతినిధి, నిజామాబాద్: గోదావరి నదిపై ఉన్న బాబ్లీ ప్రాజేక్టు గేట్లనుదులుతున్నారు.