సమన్వయంతో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేద్దాం : వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పార్టీని పటిష్టపరచాలని రాజంపేట్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-18 16:57 GMT

దిశ, తాడ్వాయి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పార్టీని పటిష్టపరచాలని రాజంపేట్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు రాజంపేట్ మండలంలో ఉన్న ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సమిష్టి కృషితోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుసాధించే విధంగా కార్యాచరణ ఉండాలని ఆయన అన్నారు. ఆ దిశగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్‌ పార్టీని మరింతగా బలపరచాలన్నారు.

అనంతరం ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పై కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకపరమైన కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని కరాఖండీగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు సల్మాన్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు వినోద్, డివిజన్ అధ్యక్షులు మదన్ లాల్, మండల సీనియర్ ఉపాధ్యక్షులు భీమరి శ్యామయ్య, ఉపాధ్యక్షులు మాశెట్టి శ్రీధర్, బన్సీలాల్, జనరల్ సెక్రటరీ సంతోష్ రెడ్డి, బీసీ సెల్ ఉపాధ్యక్షులు బీరయ్య, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు బాలరాజ్, సదాశివనగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయగౌడ్, మండల సీనియర్ నాయకులు, సరిలాల్, నర్సింలు, బలెందర్, గ్రామల అధ్యక్షులు నరేందర్ గౌడ్, గణేష్ నాయక్, రమేష్ నాయక్ గ్రామ సీనియర్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


Similar News