కామారెడ్డి బీజేపీలో నయా జోష్
మాజీ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లను ఓడించి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది.
దిశ, భిక్కనూరు : మాజీ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లను ఓడించి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. రెండు సంవత్సరాలుగా రమణారెడ్డి వెంట ఉంటూ పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అహోరాత్రులు కష్టపడి, నిద్రాహారాలు మాని ఎన్నికల్లో కష్టపడ్డందుకు తగిన ప్రతిఫలం లభించిందన్న సంతోషం వారిలో వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల వారు డబ్బు, మందు పంపిణీ చేసినా తాము ఓటర్ల వద్దకు వెళ్లి అవి పంచలేమని కాళ్లు మొక్కి వేడుకున్నట్టు తెలిపారు. రమణన్న చేసిన సేవలను గుర్తించడంతోపాటు, రూపాయి కరప్షన్ లేని పాలన అందిస్తామని చెప్పడంతో ఓట్లు వేసి గెలిపించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం వ్యప్తంగా పెద్ద ఎత్తున విజయోత్సవ సంబురాలు జరుపుకుంటున్నారు.