ఇంటికో డ్రమ్ము.. నీటి కొరతకు నిదర్శనంగా మారిన కామారెడ్డి జిల్లా

వేసవికాలం పోయి.. వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు దగ్గరగా వస్తుంది.

Update: 2024-07-12 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: వేసవికాలం పోయి.. వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు దగ్గరగా వస్తుంది. పలు ప్రాంతాల్లో తరచూ వర్షాలు పడి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఆయా ప్రాంతాల్లో వర్షాలు రాక ప్రజలు నీటి కొరతతో గోస పడుతున్నారు. అందులో కామారెడ్డి పట్టణం ఒకటి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల జాడ లేదు. ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్న డ్రమ్ములు ఇప్పటికీ తీరని నీటి తిప్పలకు నిదర్శనంగా కనిపిస్తుంది. వేసవిలో వట్టిపోయిన ఇళ్లలోని బోర్లు ఇప్పటికీ అలానే ఉన్నాయి. భూగర్భజలాలు పెరగకపోవడంతో రోజురోజుకు సమస్య తీవ్రమవుతోంది. దీంతో ప్రజలు ఇలా ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టి ట్యాంకరు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురవకుంటే నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నీరు లేక ఇబ్బందుపడుతోన్న కామారెడ్డి జిల్లా వాసులు వర్షాలు కురవాలని వర్షాలు విస్తారంగా కురవాలని వాన దేవుడ్ని కోరుకుంటున్నారు.   


Similar News