Kamareddy: సీఎం కేసీఆర్‌కు మద్దతుగా తీర్మానాలు.. షబ్బీర్ అలీ రియాక్షన్ ఇదే..!

తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయనున్నారు..

Update: 2023-09-01 11:09 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయనున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌కు పలు సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రస్తుతం గజ్వేల్ నుంచే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు. అటు కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్‌కు పలువురు నేతలతో పాటు పలు సంఘాల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కామారెడ్డి నియోజకవర్గం నుంచి భారీ మెజార్జీతో గెలిపించాలని పలు గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు తీర్మానాలు చేస్తున్నారు.

అయితే ఈ తీర్మానాలను కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తప్పుబట్టారు. సీఎం కేసీఆర్‌కు మద్దతు తీర్మానాలు ప్రకటించడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత సైతం ట్వీట్ చేయడం సరికాదన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు మద్దతు తీర్మానాలు ప్రకటించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇవ్వాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News