'తిన్న డబ్బులు వెనక్కి ఇవ్వండి ఊరుకుంటా.. లేకుంటే వదిలిపెట్టా..'

మహిళల పొదుపు సంఘాల నుంచి తిన్న పైసలను కక్కించే వరకు ఊరుకోనని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.

Update: 2024-06-23 15:17 GMT

దిశ, నిజాంసాగర్ : మహిళల పొదుపు సంఘాల నుంచి తిన్న పైసలను కక్కించే వరకు ఊరుకోనని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. ఆదివారం నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని హెడ్స్ లూస్ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన అనంతరం హసన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం దాదాపు రూ. 20 లక్షల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. ప్రస్తుత అవసరాల కోసం మరో రూ .5 లక్షలు మంజూరు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికల పట్ల కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రతిఫలం ఉంటుందని భరోసా ఇచ్చారు. హసన్ పల్లి గ్రామంలో పొదుపు సంఘాల నుంచి రూ .27 లక్షల రూపాయలు మింగేసిన పైసలను పైసా పైసా వసూలు చేసి పొదుపు సంఘాల సభ్యులకు ఇచ్చేంత వరకు తిన్నవారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. పొదుపు సంఘాల డబ్బులు తిన్నవారు ఎంతటి వారైనా స్వచ్ఛందంగా వచ్చి పొదుపు సంఘాల డబ్బులు ఇస్తే వదిలి పెడతాను అని ఇవ్వని ఎడల వారి పై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు. పొదుపు సంఘాల డబ్బులు తిన్నవారు ఎవరు కూడా బాగుపడరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జయప్రదీప్, మండలాల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, గుర్రపు శ్రీనివాస్, అనీస్ పటేల్, చికోటి మనోజ్ పటేల్, సవాయి సింగ్, గౌస్ పటేల్, అబ్దుల్ కాలేక్, వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు శారద, హుసేని, నిఖిల్, చాంద్ పాషా, కుర్ము సాయిలు, వెంకట రాములు, హరిన్, మంగలి రాములు, గాండ్ల రమేష్, రాము రాథోడ్, లాల్ సింగ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Similar News