నిజామాబాద్ జీజీఎచ్ లో జూడాల సమ్మె..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు.

Update: 2024-06-24 09:49 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా జూడ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమకు రావాల్సిన నెలసరి వేతనాలు సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతోమంది పేదరోగులకు వైద్యం అందించే తమ పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన చర్య కాదన్నారు.

ఇటీవల రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జూనియర్ డాక్టర్లకు సరైన వేతనం అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ సరైన జీవో ఎందుకు విడుదల చేయలేదని వారు ప్రశ్నించారు. హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద ఆస్పత్రి అయిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ప్రతినిత్యం 200 మంది జూనియర్ డాక్టర్లు విధుల్లో ఉంటున్నారని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే విధులు విధులకు హాజరయ్యేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు తరహాలో జూనియర్ డాక్టర్లకు తెలంగాణలో కూడా సరైన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జూడ ఉపాధ్యక్షులు సురేష్ నీరుడి, హరిత కృష్ణ, రాష్ట్ర జూడా సంఘం జాయింట్ సెక్రెటరీ షఫీ తదితరులు పాల్గొన్నారు.


Similar News