జీవన్ రెడ్డి... ఖబర్దార్

ఆర్మూర్ లో జీవన్ రెడ్డి నీ పతనం ప్రారంభమైందని, జీవన్ రెడ్డి ఖబర్దార్ అని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2023-12-09 14:18 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ లో జీవన్ రెడ్డి నీ పతనం ప్రారంభమైందని, జీవన్ రెడ్డి ఖబర్దార్ అని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఆర్టీసీ జీవన్ రెడ్డి మాల్ ను కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శనివారం సందర్శించి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రభుత్వానికి అప్పు ఉండకూడదని జీవన్ రెడ్డిని ఉద్దేశించి వినయ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ లీజు బకాయి, కరెంటు బకాయిలను జీవన్ రెడ్డి చెల్లించకుంటే ఆర్మూర్ లోని ఆర్టీసీ మాల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సీజ్ చేస్తుందని వినయ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుమారు 8 కోట్ల నిధులు బాకీ ఉన్నారని, విద్యుత్ శాఖకు రెండున్నర కోట్ల విద్యుత్ బిల్లులు బాకీ ఉన్నాడని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఈ దఫా ఎన్నికల్లో కబ్జాకోరు, బెదిరింపుల వ్యక్తిని తిరస్కరించాలని, ప్రజల మూకుమ్మడి నిర్ణయంతో నీ పతనం ప్రారంభమైందని అన్నారు.

    ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, జీవన్ రెడ్డి అహంకారానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. ఆర్టీసీ మాల్ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించకపోతే వారం రోజుల్లో మాల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సీజ్ చేస్తుందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి చేసిన ఒక్కొక్క అవినీతి అక్రమాలను పూర్తిస్థాయిలో బయటపెడతామని వినయ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, అలాంటి అక్రమదారులకు సపోర్ట్ చేయడం ఉండదన్నారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డి చేసిన ప్రతి అవినీతి కబ్జా పనులను కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బయటకు తీస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అక్రమాలను చూస్తూ ఊరుకోదని వినయ్ రెడ్డి అన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోర్త రాజేందర్, కోల వెంకటేష్, సాయిబాబా గౌడ్, మాజీద్, మారుతి రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, గోపిడి గంగారెడ్డి, చేపూర్ చిన్నారెడ్డి, కొంతం మురళి, భూపేందర్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

Similar News