ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల పదోన్నతులలో అక్రమాలు…

నిజామాబాద్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహరంలో మొన్నటి వరకు సబ్జెక్టు వారి టీచర్ల పదోన్నతుల్లోనూ అక్రమాలు జరిగాయని వెల్లడైన విషయం తెల్సిందే.

Update: 2024-06-30 14:45 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహరంలో మొన్నటి వరకు సబ్జెక్టు వారి టీచర్ల పదోన్నతుల్లోనూ అక్రమాలు జరిగాయని వెల్లడైన విషయం తెల్సిందే. తాజాగా ఫిజికల్ డైరెక్టర్ ప్రమోషన్లలోనూ అక్రమాలు జరిగినట్లు బహిర్గత మౌతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం పీడీ పోస్టుల ఖాళీల సంఖ్య 84( అందులో 79 అప్ గ్రేడ్ అయినవి కాగా, 5 ఖాళీగా ఉన్నట్లు చూపబడింది) వాటిని డీఎస్సీ కొరకు కేటాయింపులో వెల్లడించారు. పదోన్నతి కొరకు నెట్ వెకెన్సీలో 82 పోస్టులను చూయించారు. (వెబ్ లో చూపబడిన ఖాళీలు మాత్రం 76) కానీ అక్రమంగా ఆరు పోస్టులను ఖాళీలుగా ఉంచారు. రెండు ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులున్నాయి. మొత్తం 80 ఖాళీ పోస్టుల భర్తీ కూడా అలా ఉండగా ఆరు వెకెన్సీ లను వెబ్ ద్వారా కాకుండా అధికారుల ద్వారా జరగడం అవినీతికి నిదర్శనంగా చెప్పాలి. అందులో ప్రధానంగా రోస్టర్ విధానంలోనే తప్పులు జరిగినట్లు సమాచారం. ఒకే సబ్జెక్ట్ లో ఒకటి 76 తో జాబితాను ప్రదర్శించారు. వెబ్ కౌన్సిలింగ్ కు మాత్రం 80 చూపించారు. వాస్తవంగా డీఎస్సీ నుంచి నిజామాబాద్ కు వచ్చిన ఖాళీల సంఖ్య 76 మాత్రమే కావడం విశేషం.

సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు 79 అప్ గ్రేడ్ పోస్టులకు ఖాళీగా ఉన్న 5 పోస్టులు కలుపుకుని మొత్తం 84 లో డీఎస్సీకి రెండు పోస్టులు మినహాయించగా 82 ఖాళీలకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు అతి తెలివి ప్రదర్శించి కేవలం 76 ఖాళీలను మాత్రమే ప్రకటించి వాటికి పదోన్నతులు నిర్వహించిన అనంతరం వెలువరించిన పదోన్నతుల జాబితా 80 మంది ఎలా ప్రకటించారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదనంగా రెండు ఎస్టీ బ్యాక్లాగ్ లని మినహాయిస్తే 74 మాత్రమే పదోన్నతులు ఇవ్వాలి. చాకచక్యంగా 82 ఖాళీలకు బదులు 76 మాత్రమే చూపి పదోన్నతులు నిర్వహించడం జరిగింది. అసలు ట్విస్ట్ ఏమిటంటే చివరి ఆరుగురు పదోన్నతులకు రంగంలోకి దిగిన పైరవీకారులు మరో ఆరుగురికి పదోన్నతులు వస్తాయని అందుకు కావాల్సినంత దండుకొని వారిని కూడా జాబితాలో చేర్చడం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవంగా ప్రకటించాల్సిన 82 ఖాళీల స్థానంలో 76 ప్రకటించడం అక్రమాలకు నిదర్శనం. ఇది ఇలా ఉంటే ఎస్సీ పాయింట్లలో రోస్టర్ 66w, 72, 77 నంబర్లను మొత్తం మూడింటిని ఓపెన్ కేటగిరీలోకి మార్చి ఇవ్వడం వల్ల చివర్లో ఉన్నాయి. ఇద్దరు ఎస్సీ మహిళా ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని చెప్పాలి. తక్షణమే ఇప్పటికైనా కమిషనర్, డైరెక్టర్ పాఠశాల విద్యా సమగ్ర విచారణకు ఆదేశించి ఎస్సీ కేటగిరి లో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని చూపాల్సిన ఖాళీల కంటే తక్కువ ఖాళీలు చూపించి తర్వాత పైరవీకారులు రంగంలోకి దింపి అందిన కాడికి దోచుకున్న వ్యవహారం గా భావించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

నిజామాబాద్ ల్లాలో మొత్తం పీడీ ఖాళీల సంఖ్య 84(79 అప్గ్రేట్+5 క్లియర్ వేకెన్సీ) డీఎస్సీ కొరకు రెండు కేటాయింపులు జరుగగా పదోన్నతికి నెట్ వేకెన్సీ 82 (వెబ్ చూపబడేవి). వెబ్ లో చూపబడిన వేకెన్సీ స్ 76. అక్రమంగా దాచిన వేకెన్సీస్ 6. రెండు ఎస్టీ బ్యాక్ లాగ్ ఉంటాయి. మొత్తం నింపబడే వేకెన్సీస్ 80 జాబితా కూడా అలాగే ఉంది. ఆరు వేకెన్సీలు వెబ్ ద్వారా కాకుండా జిల్లా విద్యాశాఖ అధికారి పదోన్నతులు కల్పించినట్టు అది అవినీతి అక్రమాలకు ఉదాహరణగా చెబుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన పదోన్నతుల వ్యవహరాన్ని పాఠశాల విద్యాశాఖ సంచాలకులతోనే తేల్చుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్దమౌతున్నాయి.


Similar News