స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల్లో అక్రమాలు.. చక్రం తిప్పిన ఉపాధ్యాయ సంఘం నాయకులు

ఇటీవల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల లో జరిగిన వివిధ రకాల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Update: 2024-06-30 02:30 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇటీవల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులలో జరిగిన వివిధ రకాల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అన్ని రకాల అన్ని మేనేజ్మెంట్ల పదోన్నతుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన వివరాలను ఉపాధ్యాయులు బహిర్గతం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల విషయంలో ఉదాహరణగా లోకల్ బాడీ బయోసైన్స్ లో జరిగిన అక్రమాలని పరిశీలిస్తే చాలా గందరగోళంగా ఒక చోటికి ఇద్దరిని పంపించడం తిరిగి వెనుక పిలిచి మరోచోటికి బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పదోన్నతుల ప్రక్రియలో రోస్టర్ పాయింట్లకు నీళ్లొదిలారు. అదేవిధంగా బ్యాక్ లాగ్ పోస్టుల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఒక్కొక్క పోస్టుకు బదిలీ చేసి రెండు రెండుసార్లు రిలీవ్ చేయడం అధికారం లేకపోయినా హెడ్ మాస్టార్లు, ఎంఈవోలు వ్యవహరించిన తీరు ఉత్తర్వులు లేకుండానే డిప్యూటేషన్ వ్యవహారాలు జరగడం విశేషం.

సబ్జెక్టులో వెబ్ కౌన్సిలింగ్ లో 38 పోస్టులు వేకెన్సీగా చూపబడినవి బ్యాక్ లాక్ ఒకటి అనుకుంటే రోస్టర్ 31 (హెచ్ హెచ్)పోను మిగతా37 ఉపాధ్యాయులకు పదోన్నతులు రావాలి. కానీ ఈ జాబితాలో 37 మందికి పదోన్నతులు కల్పించినట్లు రెండవ జాబితా స్పష్టం చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇందులో ఒకటి ఎస్టీ బ్యాక్లాగ్ అని చెబుతూ 37 మంది జాబితా తయారయిందని చెప్పడం తప్పు. రోస్టర్ 31వ స్పెషల్ కేటగిరీ (హెచ్ హెచ్) ఈ పాయింట్ లో ఎవరూ లేకపోవడంతో దీనిని బ్యాక్ లక్ చేయాలి. కానీ అలా చేయకుండా ఈ పాయింట్ ని విస్మరించడం నిబంధనలకు విరుద్ధం మొత్తంగా 37 భర్తి చేయాలి జాబితా కూడా 37 తో అలాగే ఉంది. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్టీ బ్యాక్లాగ్ 33 డబ్ల్యూ అని చెప్పడంలో విశ్వసనీయత లేదు. ఈ పాయింట్ లో ఒక మహిళా ఉపాధ్యాయురాలు జెడ్పీఎస్ఎస్ చౌటుపల్లిలో పదోన్నతి పొందింది.

అక్కడ జాయిన్ కావడం కూడా జరిగింది. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. జాయిన్ అయిన ఆ ఉపాధ్యాయురాలు(33 ఎస్టీ మహిళ)అక్కడి నుంచి విధులకు గైరహాజర్ కావడంతో పాటు తనకు అవకాశం లభించిన ఎల్ఎఫ్ ఎల్ పదోన్నతిలో జాయిన్ కావడం జరిగింది. కానీ నిబంధన ప్రకారం మొదటగా జాయిన్ అయిన పాఠశాలలోని పనిచేయాలి. సదరు ఉపాధ్యాయురాలు పై అధికారుల నుంచి ఏ ఉత్తర్వులు లేకుండానే చింతపల్లి హెడ్మాస్టర్ రిలీవ్ చేయకుండానే వెళ్లిపోవడం ఇది గైర్హాజర్ కిందికి వస్తుంది. కానీ విద్యాశాఖాధికారులు అతి తెలివి ప్రదర్శించి ఆమె స్థానాన్ని బ్యాక్ లాగ్ గా చూపిస్తూ ఈ స్థానాన్ని మరో ఎస్టి ఉపాధ్యాయుడు జే. విజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడికి (దొడ్డి దారిలో జాబితాలో పేరు లేదు జె. విజయ్ కుమార్) ప్రత్యేకంగా పదోన్నతి ఆర్డర్ తయారు చేసి జడ్పీఎస్ఎస్ ఏరుగట్లకు పదోన్నతి కల్పించడం జరిగింది.

అక్కడ జాయిన్ కూడా అయ్యాడు. ఇది ఎలా సాధ్యం జాబితాలో లేని వ్యక్తి ఏ విధంగా పదోన్నతి పొందాడు దీనికి సమాధానం జిల్లా విద్యాశాఖ ఇవ్వాలి ఈ పాయింట్ ని (33 మహిళ)ఏ విధంగా బ్యాక్ లాగా ప్రకటిస్తారు. ఇలా దొడ్డిదారిలో నింపిన ఎస్టీ రిజర్వేషన్ పోస్ట్ మళ్ళీ ఏ విధంగా బ్యాక్లాగ్ అయిందో డీవో వివరణ ఇవ్వాలి. ఇతని పేరు 37 జాబితా సరైనది అంటున్న డీఈఓ 37 పదోన్నతుల జాబితాలో ఎందుకు చోటు లేదు. ఇది జిల్లా విద్యాశాఖ అధికారి పెద్ద ఎత్తున అక్రమాలకు నిదర్శనం కాదా! ప్రస్తుతం మొత్తం పదోన్నతి పొందిన వారు 38 అవుతారు. ఇక బ్యాక్ లాక్ అవకాశం ఎక్కడిది, ఒకటి ఎస్టీ బ్యాక్లాగ్ ఎలా ఉంటుంది అధికారులు సమాధానం చెప్పాలి.

వేకెన్సీ జాబితాలో పేర్కొన్న జెడ్పీఎస్ఎస్ ధర్పల్లి రెండు ఖాళీలు జెడ్పీఎస్ఎస్ చింతపల్లి రోడ్డు ఖాళీల నుంచిఒకరిని ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఎందుకు మరో పాఠశాలకి వెళ్లాలని ఎలా చెప్తారు ఒకసారి వెబ్ కౌన్సిలింగ్ లో ప్రకటించిన ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ అనంతరం తొలగించే అధికారం డీఈఓ కు ఎవరు ఇచ్చారు. ఇది వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ కు విఘాతం కాదా. జెడ్పీఎస్ఎస్ కోనాపూర్ పాఠశాల జాబితాలో ఎందుకు మాయమైంది. వెబ్ వేకెన్సీలు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ ఆర్మూర్ ఎలా ప్రత్యక్షమైంది. వెబ్ లో లేని ఈ పాఠశాలకు ఒకరిని ఎలా పదోన్నతి కల్పించారు. కోరుకున్న పాఠశాల నుంచి బలవంతంగా వేరే చోటికి మార్చడం ఆంతర్యం ఏమిటి. ఇది ఇలా ఉండగా సీనియారిటీ జాబితాలో ఒక ఉపాధ్యాయురాలు 2000 డీఎస్సీ ఓపెన్ కేటగిరిలో ఈమెకు పదోన్నతి రావాలి.

కానీ ఈమెను డైరెక్టరేట్ నుంచి వెలువడిన పదోన్నతి జాబితాలో నుంచి పేరు తొలగించి అక్రమంగా ఆమె తర్వాత ఒకరికి( 2001 డీఎస్సీ) ఇంటర్ డిస్టిక్ (19 డిసెంబర్2021 జాయినింగ్ ) మొత్తం ఇద్దరికీ ఓపెన్ కేటగిరీలో ఏ విధంగా పదోన్నతి కల్పించారు. ఈ అక్రమానికి జిల్లా విద్యాశాఖ సమాధానం చెప్పాలి. ఈ సబ్జెక్టులో రెండు జాబితాలలో పేర్కొన్న వివిధ పాఠశాలలకు పదోన్నతి జరిగిన వారిని రిలీవ్ చేయడానికి రెండు వేరు వేరు రిలీవింగ్ ఆర్డర్లు హెడ్మాస్టర్ /ఎంఎవోలు ఏ విధంగాఇస్తారు, దీనిపై సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పదోన్నతులపై జాయిన్ అయితే అందులో ఒకరిని మౌఖిక దేశాలతో పాఠశాల నుండి వెళ్లిపోయి మరో పాఠశాలలో జై న్ కావాలని చెప్పిన సందర్భంగా జాయిన్ అయిన పాఠశాలలో హెడ్మాస్టరు రిలీవ్ చేయకుండా ఏ విధంగా మరో పాఠశాలలో జైన్ అవుతారు.

ఆ పాఠశాల లో సదరు ఉపాధ్యాయులు అబ్స్కాండ్ (విధులకు విధులకు గైర్హాజరు) కాగా ఈ విషయంలో సంబంధిత హెడ్మాస్టర్లు డీఈఓకు ఎందుకు ఫిర్యాదు చేయరు. మౌఖికాదేశాలు పనిచేయవని ఇటు డీఈఓ కు ఎంఈఓ లకు హెడ్మాస్టర్లు గుర్తుకు రాకపోవడం విడ్డూరం. నేటికీ జెడ్పిహెచ్ఎస్ కొండూరులో ఒక పోస్టుకు ఇద్దరు అక్కడే పని చేస్తున్నారు ఇది అక్రమం కాదా! పదోన్నతుల్లో జిల్లా విద్యాశాఖ చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మౌఖికాదేశాల నాటకంగా ఆరోపిస్తున్నారు.ఈ సబ్జెక్టులో మాదిరిగానే మిగతా సబ్జెక్టులలో కూడా అనేక అక్రమాలు చోటుచేసుకొని ఉంటాయి. అందుకు రోస్టర్ పాయింట్లు ఆర్డర్ ప్రకారం జాబితాలో లేకపోవడమే నిదర్శనం. రిజర్వేషన్ క్యాటగిరి ఎస్సీ ఎస్టీలకు కొన్ని సబ్జెక్టులలో ఎస్సీ హెడేక్కోసి అని ఓపెన్ కేటగిరీలో నింపడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కమిషనర్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేస్తాం: డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతన్

సబ్జెక్టులో జరిగిన అక్రమాలపై కమిషనర్ డైరెక్టర్ సీఎన్ డీఎస్సీ స్పందించి జిల్లాలో విడుదల చేసిన పదోన్నతి జాబితాలు క్యాం స్కానింగ్ ద్వారా ఎడిట్ చేసి ఉపాధ్యాయులకు అలాటైనా ఖాళీలను మార్చినట్లుగా ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులున్నాయి. అసలైన జాబితాలతో జిల్లాలో విడుదల చేసిన జాబితాలను పరిశీలించి అక్రమాలు జరిగితే జిల్లా విద్యాశాఖ అధికారిపై తగు చర్యలు తీసుకోవాలి. డైరెక్టర్ నుంచి వెలువడిన జాబితా ఆధారంగా పదోన్నతులు స్థానాల్లో జాయిన్ కావడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.


Similar News