మాజీ సర్పంచ్ అవినీతిపై విచారణ జరిపించండి

ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ ఊరి ప్రజలు పెద్ద సంఖ్యలో మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు.

Update: 2024-09-24 14:37 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ ఊరి ప్రజలు పెద్ద సంఖ్యలో మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హెచ్ఎస్ఓ రవికుమార్ గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సుర్బిర్యాల్ గ్రామ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత అధికారంలో ఉండగా సుమారు రూ. నాలుగు కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

     చేయని అభివృద్ధి పనులకు చేసినట్టు తప్పుడు బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడినట్టు వారు పేర్కొన్నారు. అంతే కాకుండా గ్రామానికి సంబంధించిన భూమిలో సొంతంగా మడిగెలు నిర్మించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. దీంతో అక్రమ నిర్మాణాలని గ్రామ సర్వసమాజ్ జప్తు చేసుకుందని, మాజీ సర్పంచ్ అవినీతి బయటపడే వరకు పోరాడతామని చెప్పారు. కాగా సర్వసమాజ్ లు, గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ఆర్మూర్ ఏసీపీ గట్టు బస్వారెడ్డి సూచించారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కుల, గ్రామ బహిష్కరణలు, జరిమానాలు విధిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

Tags:    

Similar News