కర్నాటకలో కాంగ్రెస్ ను నమ్మి అధికారం ఇస్తే అంతా ఆగమైంది

కర్నాటకలో కాంగ్రెస్ ను నమ్మి అధికారం ఇస్తే అంతా ఆగమైందని అని రాష్ర్ట ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2023-11-18 12:07 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కర్నాటకలో కాంగ్రెస్ ను నమ్మి అధికారం ఇస్తే అంతా ఆగమైందని అని  ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం నగరంలోని సంజీవయ్య కాలనీలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే అది వేస్ట్ అవుతుందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదన్నారు. మహమ్మారి కరోనా కష్టకాలంలో తోడున్న ఎమ్మెల్యే గణేష్ గుప్త గెలుపు ఖాయమన్నారు. నగర సుందరీకరణ మొదలుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, శ్మశాన వాటికలు, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారని తెలిపారు. నగరంలో

    తాగునీటి ఎద్దడి ఉండే ఎండకాలంలో నీళ్ల ట్యాంకర్లు తిరిగేవని ఇప్పుడు వాటి అవసరం లేకుండా పోయిందన్నారు. గణేష్ గుప్తను గెలిపిస్తే నగరం మరింత డెవలప్ అవుతుందన్నారు. ఎన్నికల ముంగిట ప్రతిపక్షాలు ఇచ్చే బూటకపు హామీలు నమ్మవద్దన్నారు. ఐదు హామీలంటూ ముందుకు వస్తున్న కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట ముంచేస్తారన్నారు. ఎన్నికలంటే మూడొద్దుల పండుగ కాదని, ఐదేళ్ల భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని అన్నారు. మీ తలరాతలు మార్చేది ఓటు అని, ఎవరు మంచి చేస్తారో, ఎవరి మాటల్లో నిజాయితీ ఉందో ఆలోచించి ఓటు వేయాలన్నారు. గణేష్ గుప్తను గెలిపించి డెవలప్ మెంట్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సభలో బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్త, నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవిచంద్ర, సత్యప్రకాష్, కార్పొరేటర్లు, స్థానికులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News