బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటా

మూడు నెలలుగా చెల్లించాల్సిన బిల్లులు యాజమాన్యం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Update: 2024-03-20 16:13 GMT

దిశ, భిక్కనూరు : మూడు నెలలుగా చెల్లించాల్సిన బిల్లులు యాజమాన్యం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం ఆయన భిక్కనూరు మండలం అంతంపల్లి సమీపంలోని రాఘవ లైఫ్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగాడు. రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఆంద్యాల రమేష్ కంపెనీలో కొన్ని రోజులుగా ఇసుక, కంకర, డస్ట్ తో పాటు జేసీబీ, ట్రాక్టర్ కాంట్రాక్టర్ గా కొనసాగుతున్నాడు. కాంట్రాక్ట్ పనులకు

    సంబంధించి 5 లక్షల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఫ్యాక్టరీ యజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తుందని, తద్వారా తన వద్ద పనిచేసే లేబర్ కు బట్వాడా సరిగా ఇవ్వకపోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో అక్కడే ఆత్మహత్య చేసుకొని చస్తానని ఫ్యాక్టరీ ముందు భీష్మించుకొని కూర్చున్నాడు. దీంతో ఫ్యాక్టరీ సిబ్బంది ఆయన వద్దకు చేరుకొని సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రమేష్ ఆందోళన విరమించాడు. 


Similar News