ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి.. మున్సిపల్ కౌన్సిలర్

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ బదాం రాజ్ కుమార్ అన్నారు.

Update: 2024-07-17 15:09 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ బదాం రాజ్ కుమార్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ బదాం రాజ్ కుమార్ మాట్లాడారు.

ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ప్రజలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ వాపోయారు. ఆర్మూర్ సీఐ పై కౌన్సిలర్ రాజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పోలీస్ అధికారి డీసీపీ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పై దృష్టి సారించి పోలీస్ లను సరైన క్రమంలో ప్రజలకు సేవలందించేలా చేయాలన్నారు.


Similar News