హలో వీఆర్ఏ.. చలో మునుగోడు..

తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో తాడ్వాయి మండలానికి చెందిన రాష్ట్ర కో కన్వీనర్ ముదాం చిరంజీవి బుధవారం పాల్గొన్నరని ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2023-03-09 13:55 GMT

దిశ, తాడ్వాయి : తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో తాడ్వాయి మండలానికి చెందిన రాష్ట్ర కో కన్వీనర్ ముదాం చిరంజీవి బుధవారం పాల్గొన్నరని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర కో కన్వీనర్ ముదాం చిరంజీవి మాట్లాడుతూ బుధవారం "హలో వీఆర్ఏ చలో మునుగోడు" పాదయాత్రలో భాగంగా మునుగోడు అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చిట్యాల మీదుగా పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. 12న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శించుకుని అనంతరం బహిరంగసభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని అనేక దఫాలుగా పేర్కొన్నారని తెలిపారు.

మునుగోడు ఎలక్షన్ ముగిసిన వెంటనే 55 సంవత్సరాల పై బడిన వీఆర్ఏ వారసులకు ఒకరికి ఉద్యోగం, పే స్కేల్ జీవో అమలు చేస్తానని చెప్పినప్పటికి అమలుకు మాత్రం నోచుకోవడం లేదని అన్నారు. ఎక్కడైతే వీఆర్ఏ సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చి మభ్యపెట్టారో మళ్లీ అక్కడినుండి ఉద్యమం ప్రారంభం చేయాలని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ విజయ్, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీధర్ గౌడ్, కో చైర్మన్ నరసింహారావు రాష్ట్ర కన్వీనర్ ముదాం చిరంజీవి ముదిరాజ్, కావాలి సత్యనారాయణ, సరోజ, మాదవి గౌడ్, రాష్ట్ర వీఆర్ఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News