యోగాతో ఆరోగ్యం

ప్రతిరోజూ యోగా చేయడంతో ఆరోగ్యం పెంపొంది కుటుంబం సుఖవంతంగా ఉంటుందని మున్సిపల్ కౌన్సిలర్ అవధూత నరేందర్, మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు అన్నారు.

Update: 2024-02-25 10:53 GMT

దిశ, కామారెడ్డి : ప్రతిరోజూ యోగా చేయడంతో ఆరోగ్యం పెంపొంది కుటుంబం సుఖవంతంగా ఉంటుందని మున్సిపల్ కౌన్సిలర్ అవధూత నరేందర్, మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు అన్నారు. కామారెడ్డిలో అశోక్ నగర్ లోని ఎస్ ఎస్ వై యోగా సెంటర్ 15వ వార్షికోత్సవాన్ని ఆదివారం యోగా భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కామారెడ్డిలో యోగా భవనం నిర్మించుకోవడం శుభసూచకం అన్నారు. దీనిని ప్రతిరోజూ యోగా సాధనలో భాగం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు యోగా రామ్ రెడ్డి మాట్లాడుతూ...

    పూర్వికులు మనకు ఇచ్చిన వెలకట్టలేని సంపద యోగా అని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి పైన ఉన్నదన్నారు. ఈరోజు ఆధునిక యుగంలో కూడా విచిత్రమైనటువంటి రోగాలను కూడా నయం చేసే శక్తి యోగాకు కలదన్నారు. యోగాను దినచర్యలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు గరిపల్లి అంజయ్య గుప్తా, బాస రఘుకుమార్, పెట్టి గాడి అంజయ్య, ఈశ్వర్, గంగారెడ్డి, కరుణశ్రీ, హిమబిందు సిద్దా గౌడ్, ఎల్లయ్య, రాములు యాదవ్, ఎల్లంకి సుదర్శన్, వెంకటస్వామి, హరిత, రమ్య, భాగ్యలక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. 


Similar News