మీడియా గొంతు నొక్కుతున్న టీఆర్ఎస్, బీజేపీ..

కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు గుజరాతీయులు వ్యాపార వేత్తలైన ఇద్దరు గుజరాతీయులకు దేశ సంపదను ధారా దత్తం చేస్తున్నారని మాజీ మంత్రి మహమ్మద్ అలీషబ్బీర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2023-02-21 15:53 GMT

దిశ, మాచారెడ్డి : కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు గుజరాతీయులు వ్యాపార వేత్తలైన ఇద్దరు గుజరాతీయులకు దేశ సంపదను ధారా దత్తం చేస్తున్నారని మాజీ మంత్రి మహమ్మద్ అలీషబ్బీర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని తడకపల్లి అక్కాపూర్, కొత్తపల్లి, లక్ష్మీరావులపల్లి, చుక్కాపూర్ గ్రామాల్లో ఆయన మంగళవారం హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా గానీ ప్రాంతీయ పార్టీగాని మాట్లాడితే ఈడీ ఐటీ దాడులతో బెదిరిస్తున్నారు. భారతదేశ చరిత్రలోనే మొదటి సారిగా ఇంటర్నేషనల్ మీడియా అయిన బీబీసీపై ఐటి దాడులు సిగ్గుచేటని, దీంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతి దిగజారే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రాంతీయ పార్టీలు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి ప్రభుత్వాలు కూల్చి వాళ్ళ గుర్తులు పార్టీలు రద్దు చేస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. మోడీ, అమిత్ షా ఇద్దరు గుజరాతీలు దేశ ప్రజల సొమ్మును దోచుకుంటూ ఇద్దరు గుజరాతీయులైన ఆదాని, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని తీవ్రఆరోపణలు చేశారు. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలతో పేదప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకే వంట గ్యాస్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లులేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని, స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని తెలిపారు.

2లక్షల వరకు రైతురుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని, ఒకే ఇంట్లో అర్హులైన అందరికీ పెన్షన్లు అందిస్తామని తెలిపారు. బీడీ కార్మికులను రోడ్డుపై తీసుకువచ్చి, ఉపాధి లేనివారిగా చేసే కుట్ర జరుగుతుంది. బీడీ కార్మికరంగాన్ని బీడీవ్యవస్థనే రద్దు చేసే ఆలోచన జరుగుతుందన్నారు. బీడీ కార్మికులను ఆదుకుంటామని, అభయ హస్తం, స్త్రీ నిధి, వడ్డీ లేని రుణాల విడుదల కోసం పోరాటం చేస్తామన్నారు. గత 4 ఏళ్లుగా మహిళా సంఘాలకు రావలసిన వడ్డీ లేని రుణాలు రాష్ట్రప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా, డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుపై వేలకోట్ల దోపిడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల కోసం గుంజుకున్న రైతుల భూములకు పరిహారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కేజీ నుండి పీజీ ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు నౌసిలాల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గణేష్ నాయక్, భీమ్ రెడ్డి, శివ కృష్ణమూర్తి, ఐరేనీ సందీప్, పల్లె రమేష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు జ్యోతి, నర్సా గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News