sports competitions : క్రీడా పోటీల్లో మెరిసిన గురుకుల విద్యార్థినులు..

గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు.

Update: 2024-10-30 02:13 GMT

దిశ, ఎల్లారెడ్డి : గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఎల్లారెడ్డిలోని గురుకులానికి చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో ఏకంగా 15 పతకాలు సొంతం చేసుకున్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కామారెడ్డిలో జరుగుతున్న క్రీడా పోటీల్లో ఎల్లారెడ్డి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థినులు పాల్పంచుకున్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు మూడు స్వర్ణ, నాలుగు రజత, ఎనిమిది కాంస్య పతకాలు సాధించారు. అండర్ 17 విభాగంలో జరిగిన మూడు కిలో మీటర్ల పరుగు పందెం పోటీల్లో నందిని (బంగారు), ఎల్ సునీత (కాంస్య), 1500 మీటర్ల పందెంలో ఎం.అర్చన (స్వర్ణ), బి.కళ్యాణి (కాంస్య), 800 మీటర్ల పందెంలో అర్చన (కాంస్య), 400 మీటర్ల పందెంలో స్పందన (స్వర్ణ), కే.సునీత (రజత), 200 మీటర్ల పందెంలో ఏ.నక్షత్ర (కాంస్య), 100 మీటర్ల పందెంలో నక్షత్ర (కాంస్య), షార్ట్ పుట్ అండర్ 14 విభాగంలో వంద మీటర్ల పోటీలో ఎన్ అఖిల (కాంస్య), 400 మీటర్ల పోటీలో కే.ఇందు (రజత), 600 మీటర్ల విభాగంలో డి సంధ్య (రజత), హైజంప్ లో ఎస్ హారిక (కాంస్య), లాంగ్ జంప్ లో ఆర్.అమూల్య (కాంస్య) పతకాలు దక్కించుకున్నారు.

పిల్లల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యం : ప్రిన్సిపల్ సావిత్రి

గురుకుల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాను. గిరిజన బాలికలు చురుకుగా ఉండడం వల్ల వారిని మెరికల్లా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యతో పాటు క్రీడలతో మానసిక ఉల్లాసమే శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. పాఠశాల సిబ్బంది సహకారంతోనే ఈ విజయాలు సాధించగలిగాం.

Tags:    

Similar News