ఓపెనింగ్ చేస్తే డీఎంహెచ్ఓ ఉండడా...?
జిల్లాలో తొలిసారిగా పల్లె దావఖాన ఓపెన్ చేస్తే డీఎంహెచ్ఓ ఉండడా అంటూ ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, భిక్కనూరు : జిల్లాలో తొలిసారిగా పల్లె దావఖాన ఓపెన్ చేస్తే డీఎంహెచ్ఓ ఉండడా అంటూ ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కోటి 66 వేల 80 వేలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, పల్లె దవఖాన, సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె దవఖాన రిబ్బన్ కట్ చేసే సమయంలో డీఎంహెచ్ఓ లేకపోవడంతో తీవ్రఅసహనానికి గురయ్యారు. వెంటనే కలెక్టర్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. దీంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ కు ఫోన్ చేయగా, వీడియో కాన్ఫరెన్స్ ఉండడం వలన రాలేకపోయానని చెప్పాడు. వెంటనే గ్రామానికి వెళ్లాలని ఆదేశించగా, వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ఆగమేఘాల మీద కాచాపూర్ గ్రామానికి చేరుకున్నాడు. వీడియో కాన్ఫరెన్స్ వల్ల ప్రోగ్రాంకు అటెండ్ కాలేకపోయానని విప్ గంపకు డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ వివరణ ఇచ్చుకున్నాడు.
ఇప్పటికే కుంటోడినయ్యా...
కుంటుతున్నావే అవ్వ.. అని పలకరించి.. ఇప్పటికే తాను కాలునొప్పితో బాధపడుతూ కుంటోడినయ్యానంటూ ఓ అవ్వతో ఆప్యాయంగా గంపగోవర్ధన్ అన్నమాటలివి. తాను ఇచ్చిన నిధులతో నిర్మిస్తున్న కుర్మ యూత్ కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని చూసి కులస్తుల అందరి పెళ్లిళ్లు ఇదే భవనంలో జరిగేలా చూడాలని సూచించారు. కాలు నొప్పితో బాధపడుతున్నా గ్రామంలోని పలు ఇళ్లకు వెళ్లి, వారు చెప్పే సమస్యలను, బాధలను ఓపికగా వింటూ సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు.
గ్రామాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా...
అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్నారు. గ్రామంలో మిగిలిపోయిన వివిధ కుల సంఘాల భవనాలకు నెలలోపల ప్రొసీడింగ్స్ ఇప్పిస్తానన్నారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో 99 శాతం సిమెంటు రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, తొందర్లోనే మిగిలిన వాటిని పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి, కామారెడ్డి భిక్కనూరు ఎంపీపీ అధ్యక్షులు పిప్పిరి ఆంజనేయులు, జాంగారి గాల్ రెడ్డి, భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంత రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు తాటిపాముల పద్మనాగభూషణం గౌడ్, డీసీసీబీ డైరెక్టర్లు లింగాల కిష్టా గౌడ్, గోండ్ల సిద్దరాములు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, రైతుబంధు సేవాసమితి చైర్మన్ బోండ్ల రామచంద్రం, సర్పంచులు తొగరి సులోచన సుదర్శన్, గుడిసె రాములు, చిట్టెడి మధు మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు నాగర్తి భూం రెడ్డి, బాలగోని రాజా గౌడ్, ఏనుగు వెంకట్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దాయారి సాయి రెడ్డి, ఉప్పల బాబు, కందడి రమేష్ రెడ్డి, తాటిపాముల నాగభూషణం గౌడ్, అబ్బ బాలకిషన్, ముదాం సత్తయ్య, బద్దం రాకేష్ రెడ్డి, సిద్దా గౌడ్, రాపర్తి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.