నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు.

Update: 2024-02-07 14:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారంనిజామాబాద్​లోని ఆయన నివాసంలో విలేకరులతో ఇష్టగోష్టిలో పలు విషయాలు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని బ్రష్టు పట్టించిందని, అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పి పదేళ్లలో ఫ్యాక్టరీని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఏనాడూ ఫ్యాక్టరీని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

     గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మీదకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే ఫ్యాక్టరీని తెరిచే విషయమై కమిటీ వేసి పూర్వపరాలు చర్చించడం జరుగుతుందని తెలిపారు. రైతులను సైతం మళ్లీ చెరుకు పంట వైపు ఆకర్షితులను చేసేలా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని, ఇతర రాష్ట్రాల్లో చెరుకు సాగును పరిశీలన చేసేందుకు అధికారులను పంపి అధ్యయనం చేసిన తర్వాత ఫ్యాక్టరీని తెరిచేందుకు కృషి చేస్తామన్నారు. చెరుకుకు మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరిచాలని, ఇథనాల్ ఫ్యాక్టరీల విషయంలోనూ కేంద్రం స్పష్టమైన వైఖరి తెలపాలని కోరారు. 

Tags:    

Similar News