ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలు

భీంగల్ పట్టణ శివారులోని మొక్షానంద ఆశ్రమంలో బుధవారం ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Update: 2024-12-11 15:51 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 11: భీంగల్ పట్టణ శివారులోని మొక్షానంద ఆశ్రమంలో బుధవారం ఇస్కాన్ ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వాహకులు ఇస్కాన్ ప్రభూజి సుందర రూపదాస్ ప్రభుజీ మాట్లాడుతూ..ప్రపంచంలోనీ అత్యుత్తమ పవిత్ర గ్రంథం భగవద్గీతలోని "గీ" అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుందన్నారు. "త" అనే అక్షరం తత్వాన్ని, అంటే ఆత్మ స్వరూపాన్ని ఉపదేశిస్తుందని పేర్కొన్నారు. భగవద్గీత మహాభారతం యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించిందన్నారు. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధపడ్డారన్నారు. భగవద్గీతలోని మొత్తం 18 అధ్యాయాల్లో ఒక్కో అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారని సుందర రూపదాస్ ప్రభుజీ తెలిపారు. వీటిలో 1 నుండి 6 అధ్యాయాలను కలిపి కర్మషట్కము అని, 7 నుండి 12 వరకు ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అని అంటారన్నారు. 13 నుండి 18 వరకు జ్ఞాన షట్కము అని పేర్కొన్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక నృత్యాల ప్రదర్శన అలరించింది. విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నందగోపాల ఆనంద్ దాస్, రాజేంద్ర ప్రభు, ఉషశ్రీ దేవి దాసి, శ్రీనివాస్, దత్తు, లక్ష్మీనారాయణ, శివ, సనాతన, నరేష్, గంగాధర్, నవీన్, ప్రశాంత్, రాజేందర్, బాపూరావు, లింబాద్రి, మాతాజీలు సుమారుగా 200 మందికి పైగా హరేకృష్ణ భక్తులు పాల్గొన్నారు.


Similar News