ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొని యువకుడు మృతి..
బైపాస్ రోడ్డు పై చెడిపోయి మరమ్మత్తుల కోసం ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనక నుండి ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులో గురువారం జరిగింది.
దిశ, కామారెడ్డి : బైపాస్ రోడ్డు పై చెడిపోయి మరమ్మత్తుల కోసం ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనక నుండి ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులో గురువారం జరిగింది. దేవునిపల్లి ఎస్ఐ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నవీన్ కుమార్ (25) అనే యువకుడు గురువారం తెల్లవారుజామున బైపాస్ రోడ్డు పై నుంచి మోటార్ బైక్ పై వస్తున్నాడు. శాబ్దిపూర్ శివారులో చెడిపోయి మరమ్మత్తుల కోసం నిలిపి ఉంచిన ట్రాక్టర్ ను వెనకనుండి ఢీ కొన్నాడని తెలిపారు. దీంతో నవీన్ కుమార్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.