విధుల్లోకి తీసుకోండి.. ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్

దిశ, ఇందల్వాయి: తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ సమ్మె చేస్తున్నారు .మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 14 సంవత్సరాలుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్నా.. తమ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన చెందుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ను విధులకు తీసుకుం

Update: 2022-03-06 06:52 GMT

దిశ, ఇందల్వాయి: తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ సమ్మె చేస్తున్నారు .మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 14 సంవత్సరాలుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్నా.. తమ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన చెందుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్స్ ను విధులకు తీసుకుంటామని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్,కవిత,ఎర్రబెల్లి దాయకర్,ఎమ్మెల్యేలకు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని, సీఎం పరిధిలో ఉందని దాటవేస్తూ వచ్చారని చెబుతున్నారు. జీవో 4779 ప్రవేశపెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు కొత్త  సర్కులర్ ను తీసుకువచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలను చీకట్లో నింపుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్లు గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో గ్రామస్థాయిలో నిత్యం కూలీలకు అందుబాటులో ఉంటున్నారు. ఉపాధి హామీ పనులు చూపిస్తూ ప్రభుత్వం ఏ పథకాలను ప్రవేశపెట్టినా అందులో భాగస్వాములు అవుతున్నారు. ప్రజల వద్దకు సంక్షేమ పథకాలను తీసుకెళుతున్నారు.  గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ కు పని గంటలతో సంబంధం లేకుండా ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అన్ని పనులను చేయిస్తున్నారు. ఈ క్రమంలో తమను విధుల నుండి తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన చెందుతున్నారు. గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం,ఇంకుడు గుంతల నిర్మాణం,స్మశాన వాటిక నిర్మాణాలు,డంపింగ్ యార్డ్,హరితహారం,నర్సరీల నిర్వహణ,వంటి పనులను చేస్తున్నా గుర్తింపు లేదంటున్నారు ఫీల్డ్ అసిస్టెంట్స్.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో క్షేత్రస్థాయిలో పనులు చేయించామని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పని తీరు వల్లే మన రాష్ట్రానికి అనేక మార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు రావడం జరిగిందని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ కు విధించిన 40శాతం పనిదినాల జీవో సర్క్యులర్ నెంబర్ 4779ను ఎలాంటి షరతులు లేకుండా రద్దు చేసి 2019/20సంవత్సర కాంట్రాక్టు రిన్వాల్ చేయాలనీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రధానమైన డిమాండ్స్ ఇవే

1)సర్క్యూలర్ 4779/2020 జీవోను రద్దుచేయాలి

2) పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం చట్టం ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్స్ కు 21 వెయ్యి రూపాయలు ఇవ్వాలి

3) ప్రస్తుతం ఉన్న FA'S హెచ్.ఆర్.పాలసీనీ సవరిస్తూ ఉపాధి హామీలో పనిచేస్తున్న మిగితా స్థాయి ఉద్యోగుల మాదిరిగానే ఫీల్డ్ అసిస్టెంట్స్ ను ఎఫ్.టి.యి లుగా గుర్తించి ప్రమోషన్,బదిలీలు.హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి

4)ప్రమాదవశాత్తు లేదా సాధారణంగా మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News