ఎత్తోండ సహకార సంఘానికి తాళం వేసిన రైతులు

తమకు రావాల్సిన కోటి ఏనాబై లక్షల రూపాయల ధాన్యం డబ్బులు తమకు వెంటనే చెల్లించాలని రైతులు సహకార సంఘానికి తాళం వేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-06-07 11:42 GMT

దిశ, కోటగిరి : తమకు రావాల్సిన కోటి ఏనాబై లక్షల రూపాయల ధాన్యం డబ్బులు తమకు వెంటనే చెల్లించాలని రైతులు సహకార సంఘానికి తాళం వేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఎత్తోండ సహకార సంఘం పరిధిలోని 114 మంది రైతులు యాసంగి పండించిన పంటను ఎత్తోండ సహకార సంఘానికి ఇచ్చి రెండు నెలలు కావస్తున్నా

    ఇంకా తమకు రావాల్సిన డబ్బులు కోటి ఎనబై లక్షల రూపాయలను ఇవ్వడం లేదంటూ సహకార సంఘానికి తాళం వేసి తహసీల్దార్ కి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ సునీత, ఏఓ శ్రీనివాస్ రావు రైతులతో మాట్లాడి రైతులను సముదాయించారు. డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంఘం కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో వచ్చిన వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి రావాలని సంఘం సిబ్బందిని ఆదేశించారు. 


Similar News