రుణమాఫీ, రైతు బంధు చెల్లించాలని రైతుల సత్యాగ్రహ దీక్ష..

రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయాలని, ఎకరాకు 15 వేల రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహం ఎదుట భారతీయ కిసాన్ మోర్చా నాయకులు గురువారం రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు.

Update: 2024-07-11 10:28 GMT

దిశ, కామారెడ్డి : రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయాలని, ఎకరాకు 15 వేల రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహం ఎదుట భారతీయ కిసాన్ మోర్చా నాయకులు గురువారం రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా క్రింద ఖరీఫ్, రబీ కలుపుకొని 15 వేల రూపాయల ఆర్థిక తోడ్పాటును అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలన్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, నాయకులు విపుల్, వేణు, వెంకట్, రాజు, రంజిత్, శ్రీధర్, శ్రీనివాస్, భరత్, రజినీకాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News