సిద్ధాంతాలు వివరించి బీజేపీ సభ్యత్వం అడగాలి
సిద్ధాంతాలను వివరించి బీజేపీ సభ్యత్వం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త కార్యకర్తలను కోరారు.
దిశ, కామారెడ్డి : సిద్ధాంతాలను వివరించి బీజేపీ సభ్యత్వం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త కార్యకర్తలను కోరారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్, వ్యాపారుల సమావేశం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం 39వ వార్డు పరిధిలో కాలనీవాసులతో సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ... బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
సభ్యత్వంలో బీజేపీ తన రికార్డును తానే బద్దలు కొడుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు భరత్, కౌన్సిలర్లు శ్రీనివాస్, నరేందర్, నాయకులు వేణు, వీరేశం, సరోజ, అనిత, వెంకట్ రెడ్డి, రాజగోపాల్, గోవర్ధన్ పాల్గొన్నారు.