6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు.. ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు ఆరోపించారు.

Update: 2024-07-17 16:57 GMT

దిశ, కామారెడ్డి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం కామారెడ్డిలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ ఇంకా బలపడాల్సి ఉందన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పని చేస్తే స్థానిక సంస్థల్లో బీజేపీదే విజయం ఖాయం అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో వార్డు సభ్యుని నుంచి జడ్పీ ఛైర్మెన్ వరకు అన్ని బీజేపీ ఖాతాలో పడేలా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించిందని, కానీ క్షేత్రస్థాయిలో పార్టీ ఇంకా బలపడాల్సి ఉంది అని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పని చేస్తే స్థానిక సంస్థల్లో బీజేపీదే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో మోది చేసిన అభివృద్ధి వల్లే మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

కానీ 6 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. ఉద్యోగాలు, మహాలక్ష్మి పథకాల అమలు, రైతు రుణ మాఫీ, రైతు బంధు అమలు వంటి హామీల అమలుకై నిరుద్యోగులు, మహిళలు, రైతుల పక్షాన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం పై ఉద్యమం చేస్తుందని అన్నారు. అంతకు ముందు మొదట బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా బీజేపీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన అంశాల పై తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నేరెళ్ళ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంగారాం, బీజేపీ నాయకులు మురళీధర్ గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, చిన్న రాజులు, పైలా కృష్ణారెడ్డి, రంజిత్ మోహన్, రాము, రవీందర్ రావు, శ్రీనివాస్, విపుల్, భరత్, నరేందర్ తో పాటు మోర్చాల జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


Similar News