మౌలిక వసతుల కల్పనకు అంచనాలు రూపొందించాలి : కలెక్టర్

ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2023-03-23 13:47 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పన పై మున్సిపల్, విద్యుత్తు, ఆర్ అండ్ బీ, రెడ్ కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్తు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం వంటి పనులకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రాజీవ్ స్వగృహ ఏజీఎం సత్యనారాయణ, మున్సిపల్, విద్యుత్తు, ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్..

ఈవీఏం గోదామును గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈవీఎం గోదాంలో 1429 బ్యాలెట్ యూనిట్లు, 1117 కంట్రోల్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఈవీఎం కేంద్రం తాళాన్ని తీయించారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల పనితీరును పరీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి, శీను, కామారెడ్డి తహసిల్దార్ వెంకట్ రావు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News