ఆ నగరంలో అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం...

గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో కుక్కల బెడదతో ఎదురువుతున్న ఇబ్బందులు నగరంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా కుక్కల నియంత్రణకు నగర మేయర్ నీతూ కిరణ్ సమావేశం నిర్వహించారు.

Update: 2023-03-06 10:46 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో కుక్కల బెడదతో ఎదురువుతున్న ఇబ్బందులు నగరంలో ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా కుక్కల నియంత్రణకు నగర మేయర్ నీతూ కిరణ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నగరంలోని ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాటానికి కుక్కల్లో పునరుత్పత్తిని నియంత్రణ చేయుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత రెండు రోజులుగా ఈ బృందం వారు 20కి పైగా కుక్కలను కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ఈ బృందం వారు కాలనీల్లో ఉన్న వీధి కుక్కలను గుర్తించి తీసుకెళ్లి వాటిలో పునరుత్పత్తి కలగకుండా వెటర్నరీ డాక్టర్ వారి సిబ్బంది ఆపరేషన్లు చేసి నాలుగు రోజులు వారి పర్యవేక్షణలో ఉంచి చట్టరీత్యా తిరిగి ఎక్కడి నుండి తెచ్చారో అక్కడే వదిలేస్తామని తెలిపారు.

Tags:    

Similar News