Sriram Sagar Project : ఎస్సారెస్పీ 12 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు 12 ప్రాజెక్ట్ గేట్లును ఎత్తివేశారు.

Update: 2024-10-20 12:59 GMT

దిశ, బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు 12 ప్రాజెక్ట్ గేట్లును ఎత్తివేశారు.దీంతో 37,488 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువతో.. 5800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల తో 2200 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ తో 500, క్యూసెక్కులు వరద కాలువతో 5000 క్యూసెక్కులతో పాటు..లక్ష్మి కాల్వతో 150 క్యూసెక్కులు, భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు కాగా.. 80.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News