ఇంకా మిలింది 6 నెలల ప్రభుత్వమే..

పదో తరగతి పేపర్ లీకేజీ విషయంలో బండిసంజయ్ ని అక్రమ అరెస్టులని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జిల్లా బీజేపీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య ఆధ్వర్యంలో దహనం చేశారు.

Update: 2023-04-05 10:59 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : పదో తరగతి పేపర్ లీకేజీ విషయంలో బండిసంజయ్ ని అక్రమ అరెస్టులని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జిల్లా బీజేపీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎఎస్ఎస్సీ పేపర్ లీకేజీ విషయాన్ని గాలికి వదిలారని 30 లక్షల మంది ఉద్యోగార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు.

ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయిన వారి ఆశలు గల్లంతు చేశారని అన్నారు. కేసీఆర్ శిఖండి రాజకీయం చేస్తున్నారన్నారు. పదవ తరగతి విద్యార్థులు పేపర్ లీకేజీ పూర్తివిచారణ చేపట్టకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేశారని, ఇది హేయమైన చర్య అని అన్నారు. బస్వ లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసే దాడులకు భయపడేది లేదని, దేశ సేవ కోసం దేనికైనా సిద్ధమే అన్నారు. బండి సంజయ్ ను బేషరతుగా విడుదల చేయాలన్నారు. నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags:    

Similar News