ఆర్మూర్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం కాంగ్రెస్ నాయకులు దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా దశాబ్ది దగా కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Update: 2023-06-22 08:42 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం కాంగ్రెస్ నాయకులు దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా దశాబ్ది దగా కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆశయాలు ఇప్పటి వరకు కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. నీళ్లు నిధులు నియామకాల కోసం వేల సంఖ్యలో తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని వారు అన్నారు.

అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమరులైన ప్రజల బలిదానాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పరిశీలనకు తీసుకునే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వీరవనిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను కేసీఆర్ స్వరాష్ట్రంలో ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకుడు కోల వెంకటేష్, మండల అధ్యక్షుడు విట్టెం జీవన్, నాయకులు సాయిబాబా గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News