'మనిషి మనుగడకు డ్రగ్స్‌ వినియోగం పెను ముప్పు'

మత్తు పదార్ధాల వినియోగం మానవాళి మనుగడకు పెను ప్రమాదమని, నిషేద మాదక ద్రవ్యంగా ప్రకటించిన డ్రగ్స్‌ను చాల మంది అక్రమార్కులు అనేక మార్గాల ద్వారా చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. ఆ

Update: 2024-06-23 15:59 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మత్తు పదార్ధాల వినియోగం మానవాళి మనుగడకు పెను ప్రమాదమని, నిషేద మాదక ద్రవ్యంగా ప్రకటించిన డ్రగ్స్‌ను చాల మంది అక్రమార్కులు అనేక మార్గాల ద్వారా చేరవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర సైకియాట్రిక్ 10వ మహాసభల సదస్సు రెండ్రోజుల పాటు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ మానసిక వైద్యులు డా.ఆకుల విశాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ పోలీసులు, ఇండియన్‌ సైకియాట్రిక్‌ సోసైటి వైద్యులు, సీనియర్‌ సిటిజన్లు, పురజనులు కలిసి నిజామాబాద్‌లోని పాత కలెక్టర్‌ కార్యాలయం నుంచి రాజీవ్‌ గాంధి అడిటోరియం వరకు నిర్వహించి విద్యార్థులు, యువతతో సదస్సు నిర్వహించారు.

మాదక ద్రవ్యాలను వినియోగిస్తు యువత, పేద, మద్య తరగతి ప్రజలు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారన్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ జూన్‌ 26న ‘‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణ వ్యతిరేకత దినోత్సవంగా’’ప్రకటించారన్నారు. నిజామాబాద్‌లో ఎక్కువగా అల్పోజోలం వల్ల చాల మంది సామాన్య, పేద వర్గాలు కల్తీ కల్లుకు బానిసలవుతారు. ఇలాంటి వారి కోసం నిజమాబాద్‌లో డి అడిక్షన్‌ సెంటరును నడుపుతుపుతున్నారు. ఇలాంటి వారి పై అవగహన కల్పించడానికి ఈ కార్యకమ్రం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానసక వైద్యులు డాక్టర్‌ విశాల్‌ తోపాటు 25 మంది వైద్యులు పాల్గొన్నారు.


Similar News