కుక్కల స్వైర విహారం.. ఒకే రోజు 12 మంది పై అటాక్..

నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2023-03-14 12:01 GMT

దిశ, భీమ్‌గల్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళాలని అంటున్నారు. గ్రామంలో మంగళవారం ఒకేరోజు ఆరు బయట నిలబడి వున్న 12 మందిని వీధికుక్కలు కరిచి తీవ్ర గాయాలపాలు చేశాయి. గాయాలయ్యినవారు మెండోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.

డాక్టర్ ప్రణవ బాధితులకు వైద్యాన్ని అందించారు. అనంతరం డాక్టర్ ప్రణవ మాట్లాడుతూ కుక్క కరిచిన బాధితులకు ప్రస్తుతం ఎలాంటి అపాయం లేదన్నారు. ఒక్కరిద్దరిని ఎక్కువ కరవటంతో ఆర్మూర్ లేదా నిజమాబాద్ ఆసుపత్రికి వెళ్ళాలని డాక్టర్ ప్రణవ సూచించారు. మెండోరా గ్రామపంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ గ్రామపంచాయతీ సిబ్బందితో కుక్కలను పట్టించి స్థానిక పశువైద్యాధికారితో మత్తు మందు ఇప్పించి అడవిలో వదిలేస్తున్నాని తెలిపారు.

Tags:    

Similar News