షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు.

Update: 2024-03-04 09:54 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. పెళ్లి చేసిన ఆడబిడ్డ కుటుంబానికి భారం కాకుండా ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం లక్ష నూటపదహారు రూపాయల విలువ గల చెక్కులను నగరంలో 316 మంది లబ్దిదారులకు అందించినట్టు తెలిపారు.   

     కేంద్ర ప్రభుత్వం కూడా సాబ్ కా సాత్ సాబ్ కా వికాస్ అనే లక్ష్యంతో పని చేస్తుందని, ఇందూర్ అర్బన్ లో మైనార్టీల అభివృద్ది, సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కూమర్ గౌడ్, నగర మేయర్ దండు నీతు కిరణ్, బీజేపీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, నాగోళ్ల లక్ష్మి నారాయణ, కార్పొరేటర్స్ మాస్టర్ శంకర్, , బైకన్ మధు, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఖైజార్ చౌష్, నార్త్, సౌత్ మండలం ఎమ్మార్వో లు, ఆర్ ఐ లు, బీజేపీ నాయకులు, ఆనంద్, పవన్ ముందడ, మఠం పవన్, సందీప్, స్వామి యాదవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


Similar News