దిశ ఎఫెక్ట్​...ఇరిగేషన్ కాల్వ తెగడంపై స్పందించిన అధికారులు

ఆర్మూర్ నుంచి వెళ్లే నిజాంసాగర్ ప్రధాన కాలువ సోమవారం తెగడంతో జర్నలిస్ట్ కాలనీతో పాటు ఇతర కాలనీలు జలమయమయ్యాయి.

Update: 2024-04-04 15:00 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నుంచి వెళ్లే నిజాంసాగర్ ప్రధాన కాలువ సోమవారం తెగడంతో జర్నలిస్ట్ కాలనీతో పాటు ఇతర కాలనీలు జలమయమయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయంపై దిశ దినపత్రికలో 82\2 నంబర్ నిజాంసాగర్ ఇరిగేషన్ ప్రధాన కాలువను ఎవరూ పట్టించుకోరా అనే కథనం ప్రచురితం కావడంతో గురువారం ఇరిగేషన్, పోలీస్ శాఖల అధికారులు స్పందించి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేశారు. ఆర్మూర్ లోని జర్నలిస్ట్ కాలనీలోని నిజాం

    కెనాల్ కట్టను ఆక్రమించుకుని అందులో పందుల కొట్టం ఏర్పాటు చేసుకుని, కెనాల్ కట్ట తెగిపోవడానికి కారణం అయిన వ్యక్తి దాసరి నందిని పై సంబంధిత ఇరిగేషన్ ఏఈ పవన్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నందినిని గురువారం అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ రవి కుమార్, ఎస్సై అశోక్ లు తెలిపారు. కాగా ఈ కట్ట తెగడానికి పందికొక్కులు అని ప్రచారం అవుతుండగా అది నిజం కాదని స్థానికులు పేర్కొంటున్నారు. కాలువ కట్ట ఉన్న స్థలంలో తవ్వకాలు జరిపి కాలువ స్థలాన్ని ఆక్రమించి సన్నం చేయడంతోనే కట్ట తెగిందని స్పష్టమైంది. ఈమేరకు ఆర్మూర్ లోని పలు సోషల్ మీడియాల్లో ఈ పోస్టులు వైరల్ అయ్యాయి.  


Similar News