దిశ ఎఫెక్ట్.. ప్రభుత్వ స్థల ఆక్రమణ పై అధికారుల సర్వే

దిశ దినపత్రికలో ఆదివారం నాడు ఆర్మూర్‌లో రియల్ వ్యాపారుల హల్ చల్.. ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జాకు యత్నం అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్మూర్‌లోని రెవెన్యూ ,ఇరిగేషన్ శాఖల అధికారులు సోమవారం స్పందించారు.

Update: 2023-12-12 05:03 GMT

దిశ, ఆర్మూర్ : దిశ దినపత్రికలో ఆదివారం నాడు ఆర్మూర్‌లో రియల్ వ్యాపారుల హల్ చల్.. ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జాకు యత్నం అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్మూర్‌లోని రెవెన్యూ ,ఇరిగేషన్ శాఖల అధికారులు సోమవారం స్పందించారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్మూర్‌లో 63వ జాతీయ రహదారి పక్కన నీటిపారుదల శాఖకు చెందిన నిజాంసాగర్ స్థలం ఆక్రమణకు గురైనందున రెవెన్యూ శాఖకు చెందిన మండల సర్వేయర్ షికారి రాజు, ఆర్ఐ అశోక్ సింగ్, నీటిపారుదల శాఖ ఏఈ పవన్ జాయింట్ సర్వేను చేశారు.

జాతీయ రహదారి పక్క నుంచి నిజాంసాగర్ కాలువ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కొలతలు చేశారు. గతంలో సైతం ఈ కెనాల్ స్థలాన్ని ఆక్రమించినప్పుడు అధికారులు సర్వే చేశారు. 40/3, 40/4 సర్వే నంబర్ల మధ్యలో గల నిజాం సాగర్ కెనాల్ స్థలాన్ని కొలతలు చేసి ఏ మేరకు ఆక్రమించారో రెండు శాఖల అధికారులు కొలతలు చేశారు. సర్వే చేసిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు తెలిపారు.


Similar News