దిశ కథనంతో కదిలిన ప్రజా సంఘాలు…

దిశ దినపత్రికలో శుక్రవారం ప్రచురితం అయిన విద్యార్థుల పాలిట యమ గండం అనే శీర్షిక పై వామపక్ష ప్రజాసంఘాలు కదలి వచ్చాయి.

Update: 2024-06-30 10:21 GMT

దిశ, కొటగిరి : దిశ దినపత్రికలో శుక్రవారం ప్రచురితం అయిన విద్యార్థుల పాలిట యమ గండం అనే శీర్షిక పై వామపక్ష ప్రజాసంఘాలు కదలి వచ్చాయి. ఆదివారం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆనుకొని ఉన్న నీటి కుంటను సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గత ప్రభుత్వం ఏడు కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ భవనం నిర్మించి, గుంత పూడ్చడం మర్చి పోయిందన్నారు.

సుమారు 350 మంది విద్యార్థులకు గుంత యమగండం గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంత పూడ్చితే విద్యార్థులకు క్రీడా మైదానంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే ప్రభుత్వం, అధికారులు మేల్కొంటే బాగుంటుందని పేర్కొన్నారు. వర్షపు నీరుతో గుంత నిండితే విద్యార్థులతో పాటు, పశువులకు కూడా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించక పోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Similar News