ధర్పల్లి వీడీసీ సభ్యుల రిమాండ్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బాక గ్రామంలో పద్మశాలి కులానికి చెందిన సర్వేనెంబర్ 979 అసైన్డ్ భూమిని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్లు సొంతం చేసుకోడానికి 40 పద్మశాలి కుటుంబాలను బహిష్కరించి, వారిపై రూ. 50,000 జరిమానా విధించిన విషయంపై పోలీసు శాఖ కేసు నమోదు చేసింది.

Update: 2023-12-21 13:29 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బాక గ్రామంలో పద్మశాలి కులానికి చెందిన సర్వేనెంబర్ 979 అసైన్డ్ భూమిని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్లు సొంతం చేసుకోడానికి 40 పద్మశాలి కుటుంబాలను బహిష్కరించి, వారిపై రూ. 50,000 జరిమానా విధించిన విషయంపై పోలీసు శాఖ కేసు నమోదు చేసింది. పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు కేసులో దర్పిల్లి పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో ఐదుగురిని వీడీసీ బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

    దుబ్బాక వీడీసీకి చెందిన బాధ్యులు కొత్తి రాజశేఖర్ అలియాస్ శేఖర్ రెడ్డి, పెండ అరుణ్ అలియాస్ అర్జున్, దొంకెన చిన్న గంగారాం, భుర్కి నర్సాగౌడ్ అలియాస్ చేగంటి నర్సాగౌడ్, భూమేడ మురళి అలియాస్ వడ్ల మురళిలను రిమాండ్ కు పంపినట్లు సీపీ తెలిపారు. ఇలాంటి కుల, సామాజిక బహిష్కరణలు హేయమైన చర్యలుగా భావిస్తున్నట్టు తెలిపారు. వీడీసీ వారు జరిమానా విధించడం, ఇతరులను కుల బహిష్కరణ చేయడం, వివిధ కులలవారి దుఖానాలు, వాణిజ్య సంస్థలను బహిష్కరించడంపై ఉపేక్షించేది లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి బహిష్కరణలు చేసినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( లా అండ్ ఆర్డర్) ఎస్. జయరామ్ హెచ్చరించారు.


Similar News