Asha workers : సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆశా వర్కర్ల ధర్నా..

తమ సమస్యలను సత్వరమే పరిష్కరించక పోతే ఈనెల 22న అసెంబ్లీని ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు.

Update: 2024-07-18 14:57 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తమ సమస్యలను సత్వరమే పరిష్కరించక పోతే ఈనెల 22న అసెంబ్లీని ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఆశా వర్కర్లు నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. అంతకు ముందు వారు గాంధీ చౌక్ నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశాలు అతితక్కువ వేతనంతో ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. కరోనా సమయంలో ఆశాలు అందించిన సేవలు మరువలేనివన్నారు. రెగ్యులర్ ఎంప్లాయిస్ తో సమానంగా సేవలందిస్తున్న ఆశా వర్కర్ల పై ప్రభుత్వం చిన్న చూపు చూడటం తగదని నూర్జహాన్ అన్నారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించి సమస్యలను వివరించారు. ఆశా వర్కర్ల సమస్యల పై తాను అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త హామీ ఇచ్చారు.

Tags:    

Similar News