అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భక్తులు క్యూ

కోటి దీపాలు వెలిగించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి దంపతులు తరలిరావడంతో అనంత పద్మనాభ స్వామి ఆలయం కిక్కిరిసిపోయింది.

Update: 2024-09-17 14:44 GMT

దిశ, భిక్కనూరు : కోటి దీపాలు వెలిగించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి దంపతులు తరలిరావడంతో అనంత పద్మనాభ స్వామి ఆలయం కిక్కిరిసిపోయింది. అనంత పద్మనాభ స్వామి చతుర్దశి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం భిక్కనూరు మండల కేంద్రంలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి.

    ఆలయ అర్చకులు పెద్దెడ్ల జయప్రకాష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, సిరిసిల్ల, హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్ధిపేట జిల్లాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేడుకల నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు.  

Tags:    

Similar News