అభివృద్ధి పనుల నివేదికలను సిద్ధం చేయాలి

శాఖల వారీగా అభివృద్ధి పనులకు సంబంధించి నివేదికలను అధికారులు తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2023-12-11 10:45 GMT

దిశ, కామారెడ్డి : శాఖల వారీగా అభివృద్ధి పనులకు సంబంధించి నివేదికలను అధికారులు తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 30 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ స్వీకరించారు. పూర్తయిన అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న పనుల వివరాలు అధికారులు సేకరించాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

    అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. 


Similar News