ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు : పోచారం శ్రీనివాస రెడ్డి

బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా మంగళవారం బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి SMB ఫంక్షన్ హాల్‌లో బాన్సువాడ నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించడం జరిగింది.

Update: 2023-04-25 11:54 GMT

దిశ, బాన్సువాడ: బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) సందర్భంగా మంగళవారం బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి SMB ఫంక్షన్ హాల్‌లో బాన్సువాడ నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ రంగాలు ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటివని. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదన్నారు. పక్క రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు కావాలని అడుగుతున్నారు, లేకపోతే తమ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్ పార్టీ పాలనతోనే తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు దేశమంతటా అమలవుతాయన్నారు. అందుకే దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు BRS పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దయ, సహకారంతో 2014 తర్వాత బాన్సువాడ నియోజకవర్గానికి పది వేల కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్నారు. బాన్సువాడ అభివృద్ధి పై విమర్శలు చేస్తే వారికి ఈ అభివృద్ధి, సంక్షేమ రంగాల నిధుల వివరాలు తెలపాలని.. వివిధ పథకాలకు నియోజకవర్గంలో ఖర్చు వివరాలు వివరించారు.

నియోజకవర్గంలో పోడు భూముల సర్వే పూర్తయింది, త్వరలోనే అర్హులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలను తెలిపారు. కొంతమంది కళ్ళు ఉండి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడలేక విమర్శలు చేస్తున్నారని, వారి కోసం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై బాన్సువాడ పట్టణంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌యస్ నాయకులు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News