ఆ ప్రాంతాలని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయండి.. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
గోదావరి పరివాహక ప్రాంతాలని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయండి.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు.

దిశ, ఆర్మూర్ : గోదావరి పరివాహక ప్రాంతాలని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయండి.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఈ విధంగా ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల పురాతన ఆలయాలు ఉన్న ఉమ్మెడ, కొండూరు, చిన్నాయణం వంటి ప్రాంతాల్లో గల ఆలయాలు, గోదావరి తీరాన భూములకు పర్యాటక ప్రాంతాలు చేయడంతో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, బాసర అతి దగ్గర ఉండడంతో త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి అన్నారు. అభివృద్ధితో పాటు స్థానిక యువకులకు ఉపాధి లభిస్తుందని, సిద్ధుల గుట్ట అభివృద్ధి కోసం గతంలో దేవదాయ శాఖ మంత్రి కి విన్నవించిన స్పందించలేరని రాకేష్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ తో సమానంగా కాకున్నా కొంత అయినా నిధులను మా ఆర్మూర్ కు ఇవ్వాలి అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఇటీవల కేంద్ర మంత్రితో మాట్లాడాలని, ఈ ఎయిర్ పోర్ట్ విషయమై త్వరితగతిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇతర సర్వే రిపోర్ట్ లు ఇచ్చి సహకరించాలన్నారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లా మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన పలు ప్రశ్నలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు. నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఏకో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దీంట్లో అన్ని జిల్లాలకు ప్రాధాన్యతను ఇస్తామన్నారు.
మీ ప్రభుత్వం ఇచ్చింది ఎంత..? నేను ఆర్మూర్ కు తీసుకు పొంది ఎంత..?
రాష్ట్రంలోని మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అని.. నేను ఆర్మూర్ కు తీసుకపొంది ఎంత అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో వ్యంగంగా కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ కు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఏమి ఇచ్చాడు అని నన్ను నియోజకవర్గంలో ప్రశ్నిస్తున్నారని.. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్మూర్ నియోజకవర్గం కోసం నాకేమిచ్చిందని నేను తీసుకుపొంది ఏంటని.. మీ ప్రభుత్వ విచ్చి ఉంటే నేనెందుకు నిధులు ఆర్మూర్లో ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.
ఇదివరకు ఆర్మూర్ నియోజకవర్గపు అది కావాలి ఇది కావాలి అని ఎన్నిసార్లు శాసనసభ ముఖంగా, ఇంకా వేరే సమయాల్లో కూడా ముఖ్యమంత్రిని గాని ఇతర మంత్రులను గాని ఎంతమందిని కలిసి కోరినట్లు రాకేష్ రెడ్డి చెప్పారు. మీ ప్రభుత్వమే నిధులు ఇవ్వకుండా అక్కడ మా నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏం తెచ్చాడు అని నన్ను ప్రశ్నించడం ఏంటి అని రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి గత ఏడాదిలో ఎస్డీఎఫ్ నిధుల కింద 90 లక్షల నిధులు ఇచ్చారని, కొడంగల్ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులను అన్నారు. ప్రస్తుతం ఆర్మూర్ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో పైడి రాకేష్ రెడ్డి కోరారు. ఆర్మూర్ తో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 1000 కోట్ల ఎస్డిఎఫ్ నిధులు ఇవ్వాలన్నారు.