బిగాలకు ఓటమి కళ్ళముందు కనిపిస్తుంది : ధన్ పాల్
ఎమ్మెల్యే బిగాలకు ఓటమి కళ్ళముందు కనిపిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.
దిశ, నిజామాబాద్ సిటీ: అర్బన్ ఎమ్మెల్యే బిగాలకు ఓటమి కళ్ళముందు కనిపిస్తుందని అందుకే ప్రస్టేషన్లో ఎదో ఒకటి మాట్లాడుతున్నారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. గురువారం బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టినవి పంపిణీ చేసే దమ్ములేదన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చిన రూ.100 కోట్లు తీసుకు వచ్చే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. హిందువుల మీద ప్రేమ ఉంటే శంబుని గుడి పక్కన చుట్టూ ముట్టు చెప్పుల దుకాణాలు తొలగించాలని హితవు పలికారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిగాలకు టికెట్కు భరోసా లేదన్నారు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ రూ.25 లక్షల ఇచ్చి, ఆలయాలకు ఎదో చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారన్నారు.
మార్కండేయ మందిరానికి రూ.25 లక్షలు, విఠలేశ్వర ఆలయ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చామని అంటున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో రోజు భోజనం పెట్టామని బిగాల ప్రచారం చేసుకుంటున్నారని, 23 సంవత్సరాలుగా సొంత డబ్బు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 2020లో కరోన వచ్చినపుడు మొట్ట మొదటిగా 4500 మందికి నిత్యావసర కిట్లు మేము అందజేసామని గుర్తు చేశారు. భారతీయ జనత పార్టీ బరాబర్ కాషాయ పార్టీయే అన్నారు. ఇందూరు నగరంలో అతి పెద్ద ర్యాలీ హనుమాన్ జయంతి ర్యాలీ అని, మీరు అధికారంలోకి వచ్చిన తరువాత గత 9 సంవత్సరాలుగా పూజలో ఎన్నడూ కనిపించలేదన్నారు. బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేసిందని, ట్రిపుల్ తలక్ రద్దు చేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతామన్నారు. మీడియా సమావేశంలో కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, న్యాలం రాజు, ప్రవళిక, రోషన్ బోరా తదితరులు పాల్గొన్నారు.