ఉమ్మడి జిల్లా పై కరోనా పంజా..ఒక్కరోజే 318 కొత్త కేసులు

Update: 2022-01-17 16:42 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే నిజామాబాద్ లో 318, కామారెడ్డిలో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారం నుంచి పాజిటివ్ కేసులు పెరుగుదల ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 10 నుంచి వరుసగా వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఏకంగా ఒక్కరోజు కేసులు రావడం కామారెడ్డి జిల్లాలో మొన్నటి వరకు రెండు సార్లు 50 కేసులు నమోదు కాగా, సోమవారం 80 కేసులు వెలుగు చూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.నిజామాబాద్ జిల్లాలో మొదటి, రెండవ వేవ్‌లో నమోదైన కేసుల సంఖ్య 59,127 కామారెడ్డి జిల్లాలో 32089 కేసులు నమోదయ్యాయి.

కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కట్టడికి చర్యలు తీసుకుంటుంది. పోలీసు శాఖ భౌతిక దూరం, మాస్క్‌ల ధరింపు పై కఠినంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి ఏడాది గడిచింది. నిజామాబాద్ జిల్లాలో 19.53 లక్షల మందికి మొదటి, రెండు డోస్‌లు వేశారు. ఇటీవల 14 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి కోవిడ్ ఆసుపత్రి గా సేవలు అందిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో పలు ఆసుపత్రుల్లో 48 గంటల పాటు నిరంతరాయంగా ఆక్సిజన్, వెంటిలెటర్లు అందించేందుకు సిద్ధం చేశారు.జిల్లాలో కోవిడ్ పరీక్షలు ర్యాపిడ్, యాంటీజెన్ టెస్టులు పెంచే యోచనలో ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పరీక్షలు చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. నిజామాబాద్ ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను పెంచే ప్రక్రియ జరుగుతుంది. జనరల్ ఆసుపత్రిలో టి హబ్‌లో పరీక్షలను పెంచుతున్నారు. తాజాగా కొత్త యాక్టివ్ కేసులు ఉమ్మడి జిల్లాలో 1500 వరకు ఉండగా రెండు మరణాలు రికార్డు అయ్యాయి. ప్రభుత్వం అనుమతించక పోయిన కొన్ని ప్రైవేట్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహణతో వాటి లెక్కలు వైద్య ఆరోగ్య శాఖకు తెలియడం లేదు. సర్కార్ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం పై వైద్య ఆరోగ్య శాఖ అవగాహన పెంచే ఆలోచన చేస్తుంది.

Tags:    

Similar News