ఎమ్మెల్యే లేకుండా ఏ హోదాలో కలెక్టర్, అధికారులతో సమీక్షా నిర్వహించారు : ఎమ్మెల్యే

భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ…

Update: 2024-06-19 13:08 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ… కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్ అలీ ఏ హోదాలో కలెక్టర్ కేబిన్ లో కలెక్టర్, ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారని మండిపడ్డారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థివా జిల్లా మంత్రి అనుకుంటున్నావా, అధికారం ఉందనే అహంకారామా అని అన్నారు.

సొంత జిల్లా కామారెడ్డి లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని టికెట్ ఇస్తే నా ఇందూర్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది సరిపోలేదా మళ్లీ ఇక్కడికి ఏ మొఖం పెట్టుకొని వస్తున్నావ్ షబ్బీర్ అలీ అని ఎద్దేవా చేశారు. షబ్బీర్ అలీకి ఇందూర్ అర్బన్ ప్రజల పైన నిజమైన ప్రేమ ఉంటే అర్బన్ లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. కొత్త రేషన్ కార్డులు లేవని, పెన్షన్ లేవని, రోడ్స్, డ్రైనేజ్ సరిగా లేవని, ఇచ్చిన గ్యారంటీలు దరఖాస్తులకే పరిమితం అయ్యాయని దమ్ముంటే వందరోజుల్లో అమలు చేస్తా అన్న ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కోరారు. కొద్ది రోజుల క్రితమే అర్బన్ సమస్యల పైన సచివాలయంలో సంబంధిత మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని, వాటికి ఎటువంటి చర్యలులేవని

కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలు కమీషన్లు వసులు చేయడానికి, భూ కబ్జాలు చేయడానికి, అధికారులను భయబ్రాంతులకు చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పని చేస్తున్నారని అన్నారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే నేనే అని ఓడిపోయినోనికి గులాం చేస్తా అంటే ఊరుకోను అని జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగానికి అందరికీ మీడియా ముఖంగా హెచ్చరించారు. ఇందూర్ నగరం చాలా ప్రశాంతంగా ఉంది. ఓ వర్గానికి కొమ్ము కాస్త మరో బైంసా చేస్తుంటే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. నగరంలో రాబోయే రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన షబ్బీర్ అలీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇప్పటికే అన్ని శాఖలలో కమిషన్ ఫైరవీలు కాంగ్రెసోళ్లు మొదలు పెట్టారు.

అధికారులు చట్టబద్ధంగా నడుచుకోపోతే వారిపైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. షబ్బీర్ అలీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల తరుపు ప్రభుత్వ సలహాదారుడని ఇక్కడ శాసన, పరిపాలన విషయాలలో జోక్యం చేసుకుంటే ఊరుకోము అని, ఎమ్మెల్యే గా ప్రోటోకాల్ వ్యవహారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాలం రాజు, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, సాదు సాయి వర్ధన్, సుంకరి నారాయణ, ప్రభాకర్, ముత్యాలు, బిజెపి జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు ఖైజార్,మండల అధ్యక్షులు, గడ్డం రాజు, రోషన్ లాల్ బోర, పుట్ట వీరేందర్, బిజెపి నాయకులు,బట్టికిరి ఆనంద్, పవన్ ముందడ,పల్నాటి కార్తీక్, విశ్వ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News