ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలి

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయలు అందించి రైతుల నాదుకోవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-03-31 11:58 GMT

 దిశ, లింగంపేట్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయలు అందించి రైతుల నాదుకోవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో ఎండిన వరి పంటను పరిశీలించారు. లో వోల్టేజీ కారణంగా మోటార్లు కాలిపోవడంతో సకాలంలో నీరందక పంటలు ఎండిపోయినట్లు రైతులు మాజీ మంత్రికి వివరించారు.

    కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించినట్లు ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు వచ్చాయని ఆయన అన్నారు. ఎండిన ప్రతి ఎకరాకు 25 వేల రూపాయలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు దిగులు చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. చేతికి అంది వచ్చిన పంట ఎండిపోవడం బాధాకరమన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వెంట మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సురేందర్, జనార్దన్ గౌడ్, గంప గోవర్ధన్, హనుమాన్ షిండే తదితరులు ఉన్నారు. 


Similar News